పోషక యాజమాన్యం

  • భూసార పరిరక్షణకు, ఉత్పత్తి సబ్ధత ను అధిగమించడానికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి, పైరుకు సమతుల్యంగా పోషక పదార్ధలను అందచేయాలి.
  • పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ళ ఎరువువంటి సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని ఆదాచేయవచ్చు.
  • వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుమ, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైరును పెంచి కలియ దున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25 శాతం నత్రజని, బాస్వరం, పోటాష్లను కూడా అదా చేయవచ్చు.
  • సజీవ ఎరువులైన నీలి పచ్చ నాచు, అజోల్ల్ల, అజోస్పైరిల్లం, ఫోస్పోబాక్టీరియా  మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వర మోతదులను 10-20 శాతం తగ్గించవచ్చు.
  • నీలి ఆకుపచ్చ శైవలాలు-నాచు-వీటిని వరి పొలంలో వేస్తే ఎకరాకు 10 కిలోల నత్రజని పైరుకు అందుతుంది.  నాచు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది.  నాచును పొడిచేసి వరి నాట్లు వేసిన 7-10 రోజుల మద్య మడిలో పలచగా నీరు నిలువ గట్టి ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి  అంతా సమానంగా  పడేటట్లు చల్లాలి.